Author: Greatandhra

సహేతుక విమర్శ ఎప్పుడూ అవసరం. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని అంటే అనొచ్చు. కానీ అంత మాత్రం చేత నిర్మాణంలో వున్న పోర్టులను విస్మరించకూడదు. స్కూళ్లు, ఆసుపత్రులను చూడనట్లు నటించకూడదు. మెడికల్ కాలేజీల సంగతి ప్రస్తావించకుండా వుండకూడదు. దేనికి దాన్నే విడివిడిగా చూడాలి. విమర్శించాలి. బాగున్న వాటిని శభాష్ అనాలి. సింహాచలం గ్రామం నుంచి శొంఠ్యాం వైపు డబుల్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. యాభై ఏళ్లుగా చిన్న సింగిల్ రోడ్ గా వుంది. ఇప్పుడు చూస్తుంటే అధ్భుతమైన రోడ్ తయారవుతోంది. శ్రీకాకుళం ఆమదాల వలస మధ్యలో డబుల్ రోడ్ తయారీలో వుంది. వీరఘట్టాం పట్టణం వైపు ఇలాగే రోడ్ వెడల్పు జరుగుతోంది సీతంపేట కొండ ప్రాంతంలో అద్భుతమైన తిరుమల వెంకన్న ఆలయాన్ని టిటిడి నిర్మించింది. విజయనగరం నుంచి తాటిపూడి రిజర్వాయర్ మీదుగా బౌడరా వరకు అద్భుతమైన విశాలమైన రోడ్ రెడీగా వుంది. పర్యాటకులకు ఈ మార్గం భలే కనువిందు. ఈ రోడ్…

Read More

తమది కాని తప్పును తమ మీద వేసి, జనం ట్రోల్ చేస్తుంటే ఎవరైనా ఎదురు తిరగాల్సిందే. వైకాపా అయినా ఈ పని చేయాల్సిందే. జనాలకు నిజం చెప్పాల్సిందే. కాకినాడ నుంచి రాజానగరం వరకు వున్న రోడ్ ను నాలుగు లైన్ల రోడ్ గా మార్చే పని కొన్నేళ్ల క్రితం మొదలైంది. అది నత్త నడక నడుస్తూ, ప్రయాణించేవారికి నరకం చూపిస్తోంది. ఆ విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలోకి వచ్చి, వైకాపా ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నాయి. వైకాపా శ్రేణులు దాన్ని తిప్పి కొట్టలేకపోతున్నాయి. నిజానికి వాస్తవం వేరు. ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రాజమండ్రికి చెందిన అస్మదీయుడు ఒకరికి ఆ కాంట్రాక్టు ఇచ్చారు. మరి ఏం జరుగుతోందో? మిగిలిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అన్నీ ఫాస్ట్ గా జరుగుతుంటే ఇది మాత్రం ఇలా మూలుగుతోంది. గమ్మత్తేమిటంటే మిగిలిన కేంద్ర ప్రాజెక్ట్ లు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వాటి కాంట్రాక్టర్లు ఉత్తరాది వారు…

Read More

శ్రీకాకుళం చాలా సైలెంట్‌గా, టఫ్ ఫైట్ ను కొంత వరకు, కూటమికి ఎడ్జ్ కొంత వరకు సూచిస్తుంటే విజయనగరం జిల్లా కాస్త భిన్నంగా వుండేలా కనిపిస్తోంది. ఇక్కడ మరీ అంత సైలంట్ గా లేదు.. అలా అని వైలంట్ గానూ లేదు. జనాలు మాత్రం కాస్త హుషారుగానే వున్నారు. కానీ అలా అని బాహాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. తరచు తామర తంపరగా వస్తున్న సర్వే జనాలతో విసిగి వున్నారేమో, ప్రశ్న రాకుండానే, తెలియదు.. చెప్పలేను.. లాంటి పడికట్టు ఆన్సర్ లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. జిల్లాలో కూటమికి ఎక్కువ హోప్ వున్న స్ధానంగా బొబ్బిలి పేరు వినిపిస్తోంది. కూటమి అభ్యర్ధి బేబి నాయన మీద కన్న, ఆయన కుటుంబ నేపథ్యం ఎక్కువగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. బొబ్బిలిని పాలించిన వంశం కనుక ప్రజల్లో ఇంకా కొంత వరకు అభిమానం వుంది. కానీ కాస్ట్ ఈక్వేషన్లు వుండనే వున్నాయి.…

Read More

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఎట్ట‌కేల‌కు స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు ఆదేశాలొచ్చాయి. ఈ మేర‌కు క్యాట్ (సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున‌ల్‌) ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఆయ‌న క్యాట్‌ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ప‌లు ద‌ఫాలు విచార‌ణ అనంత‌రం… ఏబీవీకి ఊర‌ట ద‌క్కింది. చంద్ర‌బాబు హ‌యాంలో నిఘా విభాగం అధికారిగా ఏబీ కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ల‌ను ట్యాప్ చేసేవార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేర‌డం వెనుక ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషించార‌ని వైసీపీ ముఖ్య నేత‌ల ఆరోప‌ణ‌. అందుకే ఏబీవీపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు. బాబు హ‌యాంలో నిఘా ప‌రిక‌రాల వ్య‌వ‌హారం, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌ల‌పై ఏబీపై జ‌గ‌న్ స‌ర్కార్ కేసు న‌మోదు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల నుంచి అత‌న్ని త‌ప్పించి కేసు…

Read More

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ప్ర‌ధాన పార్టీలు తాయిలాల పంపిణీకీ తెర‌లేపాయి. అభ్య‌ర్థుల ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కో ర‌కంగా ఓటుకు ధ‌ర ప‌లుకుతోంది. కుప్పంలో ఓటు భారీ రేటు ప‌లుకుతున్న‌ట్టు స‌మాచారం. ఇరు పార్టీలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వ‌ర‌కు పంప‌కాలు చేప‌ట్టాల్సిన ప‌రిస్థితి. కుప్పంలో ఎలాగైనా చంద్ర‌బాబును ఓడించాల‌ని అధికార పార్టీ ప‌ట్టుద‌ల‌తో వుంది. మ‌రోవైపు కుప్పంలో గెల‌వ‌డం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. దీంతో అధికార పార్టీకి దీటుగా ఆయ‌న కూడా ఓటుకు రేటు పెట్టాల్సిన అనివార్య ప‌రిస్థితి. ఇంత‌కాలం చంద్ర‌బాబు కుప్పంలో ఊరికే గెలుస్తూ వ‌చ్చారు. కుప్పం ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని అడ్డు పెట్టుకుని, వారికేవో మాయ మాట‌లు చెప్పి రాజ‌కీయంగా చంద్ర‌బాబు ప‌బ్బం గ‌డుపుకునే వార‌ని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. కానీ వై నాట్ 175, వై నాట్ కుప్పం నినాదాల్ని వైసీపీ వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చింది. కుప్పంలో గెల‌వ‌డానికి వైసీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఒక్క…

Read More

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు మెరుసుప‌ల్లి ష‌ర్మిల‌, వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత ట్రాప్‌లో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప‌డ్డార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చాలా కాలంగా అవినాష్‌రెడ్డిపై సునీత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న తండ్రి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు అవినాషే అని, ఆయ‌న్ను ఎలాగైనా జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో సునీత సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లి పోరాటం చేశారు. అయిన‌ప్ప‌టికీ అవినాష్ బెయిల్‌ను ర‌ద్దు చేయించ‌లేక‌పోయారు. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌… సునీత‌కు ఒక తోడు దొరికింది. ఇద్ద‌రూ క‌లిసి అవినాష్ హంత‌కుడ‌ని, అలాంటి వ్య‌క్తికి క‌డ‌ప ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ ప్ర‌చారంలో హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ష‌ర్మిల‌, సునీత‌కు అవినాష్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు మీరిద్ద‌రూ మ‌నుషులేనా అంటూ నిల‌దీశారు. త‌న‌పై విమ‌ర్శ‌ల‌ను వాళ్లిద్ద‌రికి విచ‌క్ష‌ణకే వ‌దిలేస్తున్న‌ట్టు అవినాష్ చెప్పారు. ఇంత‌టితో వాళ్లిద్ద‌రినీ అవినాష్ విడిచిపెట్టి వుంటే…

Read More

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా ముందుగానే పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఓట‌ర్ల‌కు డ‌బ్బు పంపిణీ చేప‌ట్టాయి. నువ్వా, నేనా అనే స్థాయిలో పోటీ ఉన్న చోట ఓట‌ర్ల పంట పండుతోంది. కాస్త గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌న్న చోట ఓటుకు క‌నీసం రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. స‌హ‌జంగా ఓట‌ర్ల‌కు అధికార పార్టీ అభ్య‌ర్థులు డ‌బ్బు బాగా పంచుతుంటార‌ని అనుకుంటుంటారు. కానీ నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. ఆళ్ల‌గ‌డ్డ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల రీత్యా త‌న‌కు అనుకూలంగా వుంద‌ని సిటింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్య‌ర్థి గంగుల బ్రిజేంద్ర‌నాథ్‌రెడ్డి అలియాస్ నాని ధీమాగా ఉన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు అందాయ‌ని, ఓట‌ర్లు స్వ‌చ్ఛందంగా ఓట్లు వేస్తార‌ని ఆయ‌న అంటున్నారు. ఇదే సంద‌ర్భంలో త‌న ప్ర‌త్య‌ర్థి భూమా అఖిల‌ప్రియ‌తో మాట్లాడుకుని… ఇద్ద‌రూ ఓటుకు రూ.1000 చొప్పున గురువారం నుంచి పంపిణీ చేయాల‌ని సిద్ధ‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌త్య‌ర్థితో అవ‌గాహ‌న‌కు రావ‌డంపై…

Read More

ప్ర‌ధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ చ‌చ్చిన పాముతో స‌మానమ‌న్నారు. ఆయ‌న గురించి మాట్లాడ్డం టైమ్ వేస్ట్ అన్నారు. అచ్చే దిన్ తీసుకొస్తానే నినాదంతో మోదీ ప్ర‌ధాని అయ్యార‌న్నారు. అలాగే విదేశాల్లో ఉన్న బ్లాక్ మ‌నీని తీసుకొస్తాన‌ని మోదీ అంద‌ర్నీ న‌మ్మించార‌న్నారు. ఒక్కొక్క‌రి బ్యాంక్ ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు జ‌మ చేస్తాన‌ని మోదీ గొప్ప‌లు చెప్పార‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం 15 పైస‌లు కూడా జ‌న్‌ధ‌న్ ఖాతాలో ప‌డ‌లేద‌ని మంత్రి వెంక‌ట‌రెడ్డి విమ‌ర్శించారు. ప‌దేళ్లుగా ప్ర‌ధాని గా వుంటూ దేశానికి ఏం చేశారో మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్ప‌డం లేద‌న్నారు. ఇంకా రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు. మ‌తాల పేరుతో ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడంటే మోదీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు. రూ.400 సిలిండ‌ర్ రూ.1200 కావ‌డంపై మోదీ మాట్లాడ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…

Read More

పిఠాపురంలో టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌పై జ‌న‌సేన‌లో రోజురోజుకూ అనుమానం పెరుగుతోంది. పిఠాపురంలో త‌న గెలుపు బాధ్య‌త‌ను వ‌ర్మ‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉంచిన సంగ‌తి తెలిసిందే. అయితే క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చూస్తే …టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా చేయ‌డం లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. అలాగ‌ని ఈ విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌టకు మాట్లాడే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు ఎన్నిక‌ల‌కు ఇక రోజులే మిగిలి ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది ప‌వ‌న్ గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ ద‌ఫా కూడా ప‌వ‌న్ గెల‌వ‌క‌పోతే, ఇక శాశ్వంగా ఆయ‌న‌కు రాజ‌కీయ స‌మాధి క‌ట్టిన‌ట్టే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప‌వ‌న్‌ను వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత ఓడిస్తుంద‌నే మాట కంటే, వ‌ర్మ కొంప ముంచుతార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. జ‌న‌సేన‌కు వ్య‌తిరేకంగా చేయాల‌ని వ‌ర్మ ఎక్క‌డా చెప్ప‌డం లేదు.…

Read More

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గారిది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయన జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 1983 నాటికి టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు.  అలా టీడీపీలో వ్యవస్థాపక సభ్యుడుగా ఉంటూ ఎన్టీఆర్ జమానాలో ఒక వెలుగు వెలిగారు. ఆయన చంద్రబాబుకు సమకాలీనుడు. టీడీపీ 1995లో రెండుగా చీలినప్పుడు బాబు పక్షం వహించి ఆయన సీఎం కావడానికి తన వంతుగా కృషి చేసిన వారు అశోక్.  టీడీపీలో ఒక సందర్భంలో అత్యంత కీలకంగా రాజు గారి పాత్ర ఉండేది. అంతటి రాజు గారు ఇపుడు టీడీపీ మూడవ తరం వారసుడు నారా లోకేష్ విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూంటే పక్కన నిలబడి నవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసిన వారు పాపం రాజు గారు ఆనే అంటున్నారు.…

Read More