ఇదీ స‌మాజం!

కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజం… వీటిల్లో మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? ఒక చిన్న గేమ్. అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలాంటివి ఉన్నా, లేక పోయినా మనతో నిలబడేది కుటుంబం. మన మంచి…

కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజం… వీటిల్లో మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? ఒక చిన్న గేమ్.

అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇలాంటివి ఉన్నా, లేక పోయినా మనతో నిలబడేది కుటుంబం. మన మంచి కోరే వారిలో కుటుంబ బంధాలు ముందు ఉంటాయి. నువ్వు ఏం చేసినా…మంచీచెడులతో సంబంధం లేకుండా మన భుజంపై చేయి వేసి తోడు ఉండే వాడు స్నేహితుడు.

మనం ఎంత దూరంగా ఉన్నా బాగుండాలని కోరుకునే వాడు శ్రేయోభిలాషి. మనం బాగుంటే తట్టుకోలేక, మనం పైకి ఎదిగితే ఓర్వలేక, మనం చేసిన మంచిని విస్మరించి చెడును లెక్క పెడుతూ, వేలెత్తి చూపించి పైశాచిక ఆనందం పొందుతూ, అవకాశం ఎప్పుడొస్తుందా,వీడి కడుపు మీద కొడదామా, వీడి నడ్డి విరుద్దామా అని కాచుక్కూచుని ఉంటుంది సమాజం.

వీటిల్లో ఏ అంశానికి విలువ ఇస్తే దాని పైన ఆధారపడి ఉంటుంది మన జీవితం. మీకు తెలుసు…దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి అని. చెవులు మనకి మంచి చేస్తాయి. వినడం వరకే వాటి పని.

కానీ మెదడు మనకు చాలా చేటు చేస్తుంది. అది ఆలోచించడమే కాకుండా… మిగితా ఆర్గాన్స్ కూడా బాధ పడేలా చేస్తుంది. మెదడు నుంచి మనసుకి; మనసు నుంచి కంటికి, కంట్లో నుంచి కన్నీరు దాకా, అక్కడి నుంచి నేరుగా మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

ముప్పాల సాయికుమారి

4 Replies to “ఇదీ స‌మాజం!”

Comments are closed.