కల్కి 2 కి వచ్చేది అప్పుడే

కల్కి సినిమా చూసిన వాళ్లందరి క్వశ్చను..కల్కి 2 ఎప్పుడు వస్తుంది అన్నదే. ఎందుకంటే కల్కి వన్ లో జస్ట్ అసలు విషయం ఇలా టచ్ చేసి అలా వదిలారు. బోలెడు క్వశ్చన్లు అలాగే వున్నాయి.…

కల్కి సినిమా చూసిన వాళ్లందరి క్వశ్చను..కల్కి 2 ఎప్పుడు వస్తుంది అన్నదే. ఎందుకంటే కల్కి వన్ లో జస్ట్ అసలు విషయం ఇలా టచ్ చేసి అలా వదిలారు. బోలెడు క్వశ్చన్లు అలాగే వున్నాయి. కమల్ నట విశ్వరూపం తెరమీద చూడాల్సి వుంది. దీపిక కడుపున పుట్టబోయే బిడ్డ, ప్రభాస్ పోరాటాలు ఇవన్నీ బకాయి వుండనే వున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కల్కి 2 ఇప్పటికే 40శాతం పూర్తయింది. మిగిలిన అరవైశాతం షూట్ పూర్తి కావాలి. అమితాబ్, దీపిక, కమల్, ప్రభాస్ లాంటి హేమా హేమీలతో పాటు ఒకరిద్దరు వేరే నటులు కూడా జాయిన్ అవుతారు ఈ భాగంలో. సిజి వర్క్ చాలా ఎక్కువ వుంటుంది. మొదటి భాగం చూసిన తరవాత ఆ విషయం ఎలాగూ అర్థం అయిపోతుంది.

రెండో భాగం కోసం ప్రభాస్ డేట్ లు ఎప్పుడు కేటాయిస్తారు అన్నది చూడాలి. రాజాసాబ్ సగం వరకు పూర్తయింది. దాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేయాలి. స్పిరిట్ సినిమా సంగతి చూడాలి. వీటన్నింటి మధ్యలో కల్కి 2 కు కూడా డేట్ లు ఇవ్వాలి. అందరి నటుల డేట్ లు మ్యాచ్ కావాలి.

ఇవన్నీ జరిగే సరికి ఎలా లేదన్నా ఓ ఏడాది పడుతుందని అంచనా. ఈసారి డేట్ విషయంలో కూడా జాగ్రత్తగా వుండబోతున్నారు. సంక్రాంతి.. సమ్మర్ లాంటి కీలక డేట్ కు విడుదల చేసే ఆలోచన వుంది. అందువల్ల 2026 సంక్రాంతికి కల్కి 2 ను ఎక్స్ పెక్ట్ చేయచ్చు.