టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అవుతుందా?

ఏపీ విభజన తరువాత టాలీవుడ్ ని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో స్థిరపడిన పరిశ్రమ ఏపీ వైపు పెద్దగా చూసింది లేదు. తాము అక్కడే…

ఏపీ విభజన తరువాత టాలీవుడ్ ని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో స్థిరపడిన పరిశ్రమ ఏపీ వైపు పెద్దగా చూసింది లేదు. తాము అక్కడే ఉంటామని చెప్పకనే చెబుతూ రాయితీలు మాత్రం ఏపీ నుంచి కోరుతోంది.

గతంలోనే తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు భీమిలి దగ్గర మూడు వందల ఎకరాల భూమిని స్టూడియోల కోసం కేటాయిస్తారని ప్రచారం సాగింది. అది ఎంతవరకూ వచ్చిందో తెలియదు కానీ 2014లో విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధంతో కొంత దాకా చేయాల్సిన ప్రయత్నాలు చేసింది.

భీమిలీ దగ్గర ఫిల్మ్ క్లబ్ కి కొంత మేర భూములను ఇచ్చారు. టాలీవుడ్ సినీ కల్చరల్ క్లబ్ పేరుతో సినీ యాక్టివిటీని పెంచాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు విడతలుగా సినీ ప్రముఖులతో చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా విశాఖ రాజధాని అవుతుందని టాలీవుడ్ పెద్దలు తరలి వస్తే స్టూడియోలకు భూములు ఇస్తామని జగన్ చెప్పినట్లుగా ప్రచారం సాగింది. మొదట్లో అంతా బాగానే ఉంది అనిపించినా ఆ తరువాత మూడు రాజధానుల వ్యవహారంలో విపక్షం పూర్తి వ్యతిరేకతతో ఉండడంతో టాలీవుడ్ నుంచి కూడా పెద్దగా రియాక్షన్ రాలేదు అని చెప్పుకున్నారు.

మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఏపీకి తరలివస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ పెద్దలు కలసి వచ్చారు ఏపీ నుంచి సాయం టాలీవుడ్ కోరుకుంటున్న నేపధ్యంలో సహజంగానే ప్రభుత్వం వైపు నుంచి కూడా టాలీవుడ్ ని ఏపీకి తరలి రమ్మని కోరుతుందని అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ విస్తరిస్తే ఏపీలో ఉన్న కళాకారులకు కూడా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. ఈ రకమైన ప్రచారం సాగుతూండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రామోజీరావు సంస్మరణ సభలో విశాఖలో ఫిల్మ్ సిటీకి రామోజీరావు పేరు పెడతామని ప్రకటించడంతో మళ్లీ ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో విశాఖలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు అవుతుందా అన్న చర్చకు తెర లేచింది. అందుబాటులో ఉన్న భూములలో ఫిల్మ్ సిటీని నిర్మించడానికి ప్రభుత్వమే ముందుకు వస్తుందా లేక టాలీవుడ్ కి ఆ బాధ్యత అప్పగిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా టాలీవుడ్ అన్నది విశాఖకు కొంతమేరకు అయినా షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. ఈసారి ప్రయత్నం గట్టిగానే ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అయితే లోకల్ టాలెంట్ కి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

3 Replies to “టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అవుతుందా?”

  1. K-batch దోపిడీ మొదలు

    పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…

Comments are closed.