విశాఖకు టీడీపీ ఒరగబెట్టిందేంటో..?

విశాఖ గురించి ముఖ్యమంత్రి జగన్ కి అవగాహన లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖను పాలనరాజధానిగా చేసింది వైసీపీ లబ్ది కోసమేనన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. జగన్…

విశాఖ గురించి ముఖ్యమంత్రి జగన్ కి అవగాహన లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖను పాలనరాజధానిగా చేసింది వైసీపీ లబ్ది కోసమేనన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు.

జగన్ కాపులుప్పాడ కొండ మీద భారీ ఎత్తున ప్రభుత్వ అథిధి గృహం నిర్మించుకుని పాలించాలనుకుంటున్నారని, విశాఖ రోడ్లు అద్వాన్నంగా ఉన్న సంగతి  ఆయనకు తెలియదు అని చెప్పుకొచ్చారు.

సరే జగన్ కి విశాఖ మీద అవగాహన లేదనుకుందాం, మరి అయిదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది కదా. నాడు విశాఖకు ఏమైనా బంగారు భవనాలు తెచ్చిపెట్టారా.  ఇక విశాఖ అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేంటని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కనీసం విశాఖలో హై కోర్టు బెంచ్ కూడా చంద్రబాబు ఏర్పాటుకు సుముఖంగా లేరన్నది కూడా వారు గుర్తు చేస్తున్నారు. విశాఖను అన్ని రకాలుగా గత సర్కార్ వాడుకుంది కానీ రాజధాని హోదా మాత్రం ఇవ్వలేదని మండి పడుతున్నారు.

జగన్ విశాఖ నుంచి భోగాపురం వరకూ అయిదు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదించిన సంగతికి కూడా తమ్ముళ్ళకు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.  సరే ఎవరెన్ని గుర్తు చేసినా కూడా టీడీపీ తన రొడ్డగొట్టుడు విమర్శలు ఆపదు సరికదా విశాఖలో ప్రభుత్వ అథితి గృహం ఎందుకని అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడమే అసలైన విడ్డూరం.

పాపం, ఆర్కేని ఎలా మోసం చేయాలనిపించింది